‘ఆర్ఆర్ఆర్'కు వాయిస్ ఓవర్?

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ పాత్రల తాలూకు ఉపోద్ఘాతాల సన్నివేశాలకు చిరంజీవి వాయిస్ఓవర్ అందించబోతున్నారని తెలిసింది. పాన్ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా గురించి రాజమౌళి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వివిధ భాషల్లోని అగ్ర కథానాయకులతో ఈ సినిమాకు వాయిస్ఓవర్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. హిందీ వెర్షన్‌కు అమీర్‌ఖాన్ తన గళాన్ని అందించబోతున్నారని చెబుతున్నారు. అలాగే తమిళ, మలయాళ వెర్షన్స్‌కు కూడా ఆయా భాషల అగ్రహీరోలు వాయిస్ఓవర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం. చారిత్రక, కాల్పనిక అంశాల కలబోతగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమరం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్ తాలూకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దాదాపు 400కోట్ల భారీ వ్యయంతో నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
తాజావార్తలు
- సింగరేణిలో 372 పోస్టులు
- కత్తితో పొడిచి.. గొంతు కోశాడు
- సుశాంత్ సింగ్‌కు దక్కిన గొప్ప గౌరవం
- తెలంగాణ యాదిలో.. అమృతవర్షిణి.. అచ్చమాంబ
- సబ్సిడీ ఎరువు.. ఇకపై నెలకు 50 బస్తాలే
- పది లక్షల మందికి కొవిడ్ టీకా
- ప్రమాదమెరుగని ఆర్టీసీ డ్రైవర్లు వీరు
- స్టైలిస్ట్‌తో మరీ ఇంత చనువుగానా.. సమంత పిక్ వైరల్
- నేటినుంచి లాసెట్ రెండో విడుత కౌన్సెలింగ్
- పాఠాలతో పాటే పంటలూ...