గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 25, 2020 , 12:25:07

ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. తొలి ట్వీట్ ఇదే!

ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. తొలి ట్వీట్ ఇదే!

డిజిట‌ల్ యుగంలో సోష‌ల్ మీడియా అనేది ప్ర‌జ‌ల దైనంద‌న జీవితంలో ఓ భాగంగా మారింది. సోష‌ల్ మీడియా ఉంటే ప్ర‌పంచంలో జ‌రుగుతున్న ఏ విష‌యాన్నైన ఇట్టే తెలుసుకోవ‌చ్చు. ప‌లువురు ప్ర‌ముఖులంద‌రు  సోష‌ల్ మీడియా ద్వారా వ‌ర్క్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని షేర్ చేస్తూ త‌మ అభిమానుల‌కి చాలా ద‌గ్గ‌రగా ఉంటున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు సామాజిక మాధ్య‌మాల‌కి దూరంగా ఉన్న చిరు ఈ రోజు ఉగాది సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

అందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో , తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుండి మాట్లాడడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు చిరు.  మరో ట్వీట్‌గా  21 రోజులు మనందరినీ ఇళ్ళల్లోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ఓ అనివార్యమైన చర్య. ఈ క్లిష్టమైన సమయంలో మనం, మన కుటుంబాలు, మనదేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీగారు, మన ప్రియ ముఖ్య మంత్రలు శ్రీ కేసీఆర్‌ గారు, శ్రీ జగన్‌ గారు ఇచ్చే ఆదేశాలని పాటిద్ధాం. ఇంటి పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం అని స్ప‌ష్టం చేశారు. 

ఇక అభిమానులు మెగాస్టార్ ట్విట్టర్ ఐడీని @KChiruTweets అనుసరించవచ్చు. ప్రొఫైల్ పిక్‌గా ఖైదీ నెం 150లోని స్టిల్‌ని జ‌త చేశారు.  కాగా ఇప్పటికే చిరు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. మెగాస్టార్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటివరకూ 383 కె కంటే ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఇంకా చాల విస్తృతంగా ఫాలోవర్స్ పెరుగుతున్నారు.  సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న ప్ర‌స్తుతం ఆచార్య అనే సినిమాతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. 


logo