శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 11:33:37

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఆత్మ‌కి శాంతి చేకూరాలి: చిరంజీవి

జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి ఆత్మ‌కి శాంతి చేకూరాలి:  చిరంజీవి

సీనియ‌ర్ న‌టుడు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న మృతి సినీ ఇండ‌స్ట్రీకి తీర‌ని లోటు. చివ‌రిగా ఆయ‌న‌తో ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంలో క‌లిసి న‌టించాను. ఆయ‌న గొప్ప న‌టుడు. నాట‌క రంగం న‌న్ను క‌న్న త‌ల్లి, సినిమా రంగం న‌న్ను పెంచిన త‌ల్లి అనేవారు. అందుకే ఇప్ప‌టికి శ‌ని, ఆది వారాల‌లో షూటింగ్‌లు పెట్టుకోనండి, స్టేజ్‌పై ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తుంటాను.మీరు ఎప్పుడైన రావాలి అని అడిగేవారు. ఆ అవ‌కాశాన్ని నేను పొంద‌లేక‌పోయాను 

సినిమాల‌లో రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌నిస్ట్ అంటే మొద‌టు గుర్తుకు వ‌చ్చేది జ‌య‌ప్రకాశ్ రెడ్డి గారే. త‌నకంటూ ప్ర‌త్యేక ట్రెండ్ సెట్ చేసుకున్నారు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని చిరు ట్వీట్ చేశారు. రాజేంద్ర‌ప్రసాద్,రాజ‌మౌళి, సునీల్‌,రాధికా శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు కూడా జ‌య‌ప్ర‌కాశ్ మృతికి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు.


logo