మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 14:45:26

బాలు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది: చిరంజీవి

బాలు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది:  చిరంజీవి

అమ‌ర‌గాయ‌కుడు ఎస్పీ బాలు మృతిపై చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతికి గుర‌య్యారు. బాలు నా సొంత అన్న‌య్య‌. నా అన్న‌ను కోల్పోవ‌డం జీర్ణించుకోలేక‌పోతున్నాను. ఆయ‌న లేని లోటు ఎవ‌రు పూడ్చ‌లేనిది.  కేవ‌లం మా మాధ్య సినిమా సంబంధ‌మే కాదు. మంచి కుటుంబ సంబంధం కూడా ఎంతో ఉంది. తెలుగు సినిమాకు బాలు లోటు ఇంకెవ్వ‌రు పూడ్చ‌లేనిది. రుద్ర‌వీణ‌, శుభ‌లేఖ చిత్రాల‌ను చూసి చాలా మెచ్చుకున్నారు.  బాలు కుటుంబ స‌భ్యుడి క‌న్నా ఎక్కు వ క్లోజ్‌. నా విజ‌యాల వెనుక బాలు ప్రోత్సాహం చాలా ఉందని చిరంజీవి పేర్కొన్నారు.

తెలుగు సినిమాల‌కు బాలు లేని లోటు ఎవ‌రు పూడ్చ‌లేనిది. నా సూప‌ర్ హిట్ పాట‌ల‌న్నీ ఇళ‌య‌రాజా, బాలు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన‌వే. ఆయ‌న యువ గాయ‌కుల‌ని ఎంతగానో ప్రోత్స‌హించారు. ఈ రోజు సంగీత ప్రపంచానికి చీకటి రోజు. సంగీత జ్ఞాని ఎస్పీ బాలసుబ్రహ్మణం మృతితో ఓ శకం ముగిసింది. దిగ్గజ గాయకుడు ఘంటసాల తర్వాత ఆ స్థానాన్ని ఎవ‌రు భ‌ర్తీ చేస్తారిన అంద‌రు ఆలోచిస్తున్న స‌మయంలో  ఓ ధ్రువ తార ఎస్పీ బాలు రూపంలో అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మందిని దశాబ్దాలు పాటు బాలు తన గాత్రంతో అలరించారు. ఆయ‌న లేని లోటు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీరని లోటు. ఆయ‌న పాట చిర‌స్మ‌ర‌ణీయం ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నాను.


logo