బుధవారం 03 జూన్ 2020
Cinema - May 17, 2020 , 16:52:42

5 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకున్న తండ్రి, కొడుకులు

5 ల‌క్ష‌ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకున్న తండ్రి, కొడుకులు

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లేని సెల‌బ్రిటీ లేరు. అభిమానుల‌తో ద‌గ్గ‌రగా ఉండ‌డంతో పాటు త‌మ‌లోని భావాల‌ని ప్ర‌జ‌ల‌ని వ్య‌క్త‌ప‌రిచేందుకు చాలా మంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాని వాడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కొద్ది రోజు క్రింద‌ట ట్విట్ట‌ర్‌లోకి అడుగుపెట్టారు. తాజాగా వారి ఫాలోవ‌ర్స్ సంఖ్య 5 ల‌క్ష‌ల‌కి చేరుకుంది.

ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి ఫాలోవ‌ర్స్ సంఖ్య 506.5 కే కాగా, రామ్ చ‌ర‌ణ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 500.3కే గా ఉంది. ట్విట్ట‌ర్‌లోకి అడుగుపెట్టినప్ప‌టి నుండి తండ్రి కొడుకులు ఇద్ద‌రు త‌మ‌దైన శైలిలో ట్వీట్స్ చేస్తూ అల‌రిస్తున్నారు. చిరు, రామ్ చ‌ర‌ణ్ ఒకేసారి 500 కే మార్క్ చేరుకోవ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే, చిరంజీవి  ఆచార్య అనే సినిమా చేస్తుండ‌గా, రామ్ చ‌రణ్ ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. అయితే ఆచార్య‌లో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర‌పోషిస్తున్న విష‌యం తెలిసిందే


logo