బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 18:34:30

మెగాస్టార్‌ ఆచార్య షూటింగ్‌ ఎప్పటి నుంచంటే..

మెగాస్టార్‌ ఆచార్య షూటింగ్‌ ఎప్పటి నుంచంటే..

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నవంబర్‌లో తిరిగి షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సామాజిక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతం అందించారు. కరోనా లాక్‌డౌన్‌తో మార్చిలో ఆచార్య షూటింగ్‌ నిలిచిపోయింది. ఇప్పటికే సగం వరకు చిత్రీకరణ పూర్తయిందని తెలుస్తోంది. చిరంజీవి జూన్ నెలలోనే తిరిగి ప్రారంభించాలనుకున్న.. కరోనా ఉధృతి తగ్గకపోవడంతో వెనక్కి తగ్గారు. తాజా అప్‌డేట్‌ ప్రకారం.. నవంబర్‌ నుంచి కొరటాల శివ, ఆయన టీమ్‌ కొత్త షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. చిరు అన్ని ప్రభుత్వ దాతృత్వ సంస్థలు, ఎండోమెంట్స్ నిర్వహణపై దృష్టి సారించే ఎండోమెంట్స్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగి పాత్రను పోషిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్‌గా కనిపిస్తారట. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు ప్రేరణగా నిలిచేలా ఉంటుందని, చరణ్‌కు చెల్లెలి పాత్రలో నిహారిక కనిపించనుంది. చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ కలిసి నిర్మిస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo