e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home సినిమా 'వీర‌య్య‌'గా మెగాస్టార్ చిరంజీవి..?

‘వీర‌య్య‌’గా మెగాస్టార్ చిరంజీవి..?

'వీర‌య్య‌'గా మెగాస్టార్ చిరంజీవి..?

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య సెట్స్ లో ఉండ‌గా..వేదాళ‌మ్‌, లూసిఫ‌ర్ రీమేక్‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. వీటితోపాటు బాబీ డైరెక్ష‌న్‌లో కూడా సినిమాను ఒకే చేశాడు.

ఇపుడు సినీ ల‌వ‌ర్స్ లో బాబీ-చిరు ప్రాజెక్టు ఎలా ఉంటుంద‌నే ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు. క‌మ‌ర్షియ‌ల్ పాట్‌బాయిల‌ర్ స్పెష‌లిస్ట్ రాసిన ఒరిజిన‌ల్ స్టోరీ ఆధారంగా చిరు సినిమా ఉండబోతుంద‌ని టాక్‌‌. వీర‌య్య టైటిల్‌ను ఫిక్స్ చేస్తాన‌ని వినిపిస్తుండ‌గా..ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర పేరు వీర‌య్య (టైటిల్ రోల్‌)న‌‌ట‌.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించనుంది. యాక్ష‌న్‌, కామెడీ, ఫ్యామిలీ ఎమోష‌న్స్ కు స‌మాన ప్రాధాన్య‌మిస్తూ సినిమా సాగ‌నుంద‌ట‌. మ‌రి ఈ వార్త నిజ‌మే అయితే చిరంజీవి వీర‌య్య‌గా ఎలా క‌నిపిస్తాడ‌నేది ఆస‌క్తిక‌ర అంశ‌మే. సినిమా సెట్స్ పైకి వెళ్లే కంటే ముందు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
'వీర‌య్య‌'గా మెగాస్టార్ చిరంజీవి..?

ట్రెండింగ్‌

Advertisement