శనివారం 26 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 12:05:42

సాయంత్రం చిరు స‌ర్‌ప్రైజ్ ఏంటో తెలుసా?

సాయంత్రం చిరు స‌ర్‌ప్రైజ్ ఏంటో తెలుసా?

లాక్‌డౌన్ స‌మ‌యంలో ట్విట్ట‌ర్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి త‌న పోస్ట్‌ల‌తో అభిమానుల‌లో ఉత్తేజం నింపాడు. రెగ్యుల‌ర్ యాక్టివిటీస్‌తో పాటు గ‌త స్మృతులు, పాక‌శాస్త్ర విన్యాసాలు ఇలా అనేక అంశాల‌కి సంబంధించి త‌న ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశాడు. తాజాగా సాయంత్రం 4 గంట‌ల‌కు ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు...’ చేస్తున్నానంటూ తెలియజేశారు చిరు.

సందీప్ రెడ్డి వంగా మొద‌లు పెట్టిన‌ ‘బీ ద రియ‌ల్ మేన్’ ఛాలెంజ్‌లో భాగంగా త‌ల్లికి దోశ చేసి పెట్టిన చిరంజీవి ఈ రోజు ‘చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు...’ ఎవ‌రి కోసం చేస్తున్నాడా అని అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డ్డారు. చిరంజీవి చేయ‌నున్న ఈ స్పెష‌ల్ వంట‌కం కోసం ఫ్యాన్స్ ఆస‌క్త‌గా ఎదురు చూస్తున్నారు. ఇక క‌రోనా ఎఫెక్ట్ త‌ర్వాత చిరంజీవి ఆచార్య అనే సినిమా షూటింగ్‌లో పాల్గొనున్న సంగ‌తి తెలిసిందే. 


logo