శనివారం 30 మే 2020
Cinema - Apr 07, 2020 , 13:44:52

లేడి అభిమానికి హార్ట్ ఆప‌రేష‌న్ చేయించ‌నున్న చిరు

లేడి అభిమానికి హార్ట్ ఆప‌రేష‌న్ చేయించ‌నున్న చిరు

వెండితెర‌పై త‌న అస‌మాన న‌ట‌న‌తో ఎంద‌రో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు చిరంజీవి. ఆరు ప‌దుల వ‌య‌స్సులోను ఇంకా  త‌న న‌ట‌న‌తోను, డాన్స్‌ల‌తోను అభిమానుల‌ని ఎంతగానో అల‌రిస్తున్నారు. అయితే రీల్ లైఫ్‌లోనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లోను ఎన్నో సామాజిక సేవ కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్న చిరంజీవి ప్రేక్ష‌కుల గుండెల్లో గూడు క‌ట్టుకున్నారు. అభిమానుల‌కి ఆప‌ద వ‌స్తే తానున్నాననే భ‌రోసా త‌ప్ప‌క ఇస్తూ వ‌స్తున్నారు

ఇటీవ‌ల చిరంజీవి అభిమాన సంఘం అధ్య‌క్షుడు అనారోగ్యం కార‌ణంగా మ‌ర‌ణించ‌గా, స్వ‌యంగా ఆయ‌న ఇంటికి వెళ్ళి ప‌రామ‌ర్శించారు మెగాస్టార్. కొంత ఆర్ధిక సాయం కూడా చేశారు. తాజాగా  గుంటూరుకు చెందిన చిరు మహిళా అభిమాన సంఘం అధ్య‌క్షురాలు నాగ లక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతోందని తెలుసుకున్న చిరు ఆమె వైద్యానికి కావ‌ల‌సిన ఖ‌ర్చులు భ‌రిస్తాన‌ని మాట ఇచ్చార‌ట‌. స్టార్ హాస్పిట‌ల్‌లో రేపు ఆమె శ‌స్త్ర చికిత్స జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుంది. లాక్‌డౌన్ కార‌ణంగా చిరు ఆమెని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌క‌పోవొచ్చ‌ని స‌మాచారం 


logo