శుక్రవారం 07 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 15:15:28

మా న‌వ్వు వెనుక కార‌ణం నువ్వే: చిరంజీవి భార్య‌

మా న‌వ్వు వెనుక కార‌ణం నువ్వే:  చిరంజీవి భార్య‌

కన్నడ యాక్టర్ చిరంజీవి సర్జా  చిన్న వ‌య‌స్సులోనే గుండెపోటుతో మ‌ర‌ణించ‌డాన్ని ఆయ‌న అభిమానులు, కుటుంబ స‌భ్యులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ముఖ్యంగా అతని భార్య మేఘనారాజ్ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవ‌ల త‌న మ‌నోవేద‌న‌ని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్న మేఘ‌నా రీసెంట్‌గా త‌న ఫ్యామిలీతో క‌లిసి సంతోషంగా ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల‌లో ప్ర‌తి ఒక్క‌రి మోముపై చిరున‌వ్వు ఉండ‌డం విశేషం.

రీసెంట్‌గా చిరంజీవి భార్య మేఘ‌నా త‌న ఇంట్లో సంస్మ‌ర‌ణ స‌భ‌ని ఏర్పాటు చేయ‌గా కుటుంబ స‌భ్యులు అంద‌రు హాజ‌ర‌య్యారు. వారందరు చిరంజీవి ఫోటో ఫ్రేమ్ ముందు కూర్చొని ఫోటోల‌కి ఫోజులిచ్చారు. ఈ ఫోటోల‌ని షేర్ చేస్తూ.. మేఘ‌నా ఇలా రాసింది. నా ప్రియ‌మైన చిరు..చిరు ఉంటే ఓ పండుగ‌లా ఉంటుంది. మేము బాధ‌లో ఉండ‌డం నీకు న‌చ్చ‌దు. నా న‌వ్వు వెనుక కార‌ణం చిరునే. అత‌ను నాకిచ్చిన‌ది చాలా విలువైన‌ది. ప్ర‌తి రోజు నీకు న‌చ్చిన విధంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. నీ న‌వ్వు, చిలిపిత‌నం, నీ నిజాయితి ముఖ్యంగా అంద‌రు క‌లిసి ఉండాల‌నుకోవ‌డం నీపై మాకు ఎల్ల‌ప్పుడు ప్రేమ ఉండేలా చేస్తుంద‌ని మేఘ‌నా త‌న పోస్ట్‌లో రాసుకొచ్చింది.  మేఘ‌నా ప్ర‌స్తుతం నాలుగు నెల‌ల గ‌ర్భ‌వ‌తి కాగా, త్వ‌ర‌లో పండంటి బేబికి జ‌న్మ‌నివ్వ‌నుంది. 


<p>లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో.<b><font color="#0000ff"> <a href="https://play.google.com/store/apps/details?id=com.namasthetelangana" target="_blank">న‌మ‌స్తే తెలంగాణ</a></font></b><a href="https://play.google.com/store/apps/details?id=com.namasthetelangana" target="_blank"> </a>ఆండ్రాయిడ్ యాప్   డోన్‌లోడ్ చేసుకోండి.<br></p>logo