e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News బ‌న్నీతో స్టెప్పులేయ‌నున్న మెగాస్టార్..!

బ‌న్నీతో స్టెప్పులేయ‌నున్న మెగాస్టార్..!

బ‌న్నీతో స్టెప్పులేయ‌నున్న మెగాస్టార్..!

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వార్త మెగా అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది. నిజంగా ఇది జ‌రిగితే థియేట‌ర్‌లో ర‌చ్చ మాములుగా ఉండ‌ద‌ని ముచ్చ‌టించుకున్నారు. మ‌రి ఆ వార్త ఏంటంటే, అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప చిత్రంలో చిరు కామియో రోల్ పోషించ‌నున్నార‌ట‌. దేవి శ్రీ ప్ర‌సాద్ రూపొందిస్తున్న స్పెష‌ల్ సాంగ్‌లో బ‌న్నీ, చిరు క‌లిసి ఓ స్టెప్ వేయ‌నున్నార‌ని తెలుస్తుంది.

గ‌తంలో డాడీ సినిమాలో చిరంజీవి, బ‌న్నీ క‌లిసి డ్యాన్స్ చేశారు. ఇప్పుడు పుష్ప చిత్రంలో ఇద్ద‌రు క‌లిసి న‌ర్తిస్తే ప్రేక్ష‌కుల‌కు క‌నుల పండుగ‌గా ఉంటుంది. బ‌న్నీ న‌టిస్తున్న పుష్ప చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతుండ‌గా, ఇందులో అల్లు అర్జున్ ..పుష్ప రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. సుకుమార్ ఈ చిత్రాన్ని 250 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నాడు. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయిందని.. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బ‌న్నీతో స్టెప్పులేయ‌నున్న మెగాస్టార్..!

ట్రెండింగ్‌

Advertisement