మంగళవారం 14 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 01:52:34

‘ఆచార్య’లో ద్విపాత్రాభినయం?

‘ఆచార్య’లో ద్విపాత్రాభినయం?

గతంలో అనేక చిత్రాల్లో ద్విపాత్రాభియంలో మెప్పించారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. తాజాగా ఆయన మరోమారు డ్యూయల్‌ రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కరోనా ప్రభావంతో చిత్రీకరణను నిలిపివేశారు. ఈ సినిమాలో చిరంజీవి నక్సలైట్‌ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. కథలో కీలకమైన ఫ్ల్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో ఆయన దేవాదాయ శాఖకు చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తారని చెబుతున్నారు. ఈ పాత్ర తక్కువ నిడివి ఉన్నప్పటికి అత్యంత ప్రభావశీలంగా ఉంటుందని సమాచారం. నక్సలైట్‌, ప్రభుత్వ ఉద్యోగిగా చిరంజీవి శక్తివంతమైన పాత్రల్లో కనిపిస్తారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ యువ నాయకుడిగా అతిథి పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.logo