నితిన్-కీర్తిసురేశ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. మార్చి 26న విడుదల కాబోతుంది. నరేశ్, వెన్నెలకిశోర్, అభినవ్ గోమాటం కీ రోల్స్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.
రంగ్ దే ప్రమోషన్స్ లో భాగంగా నితిన్, సీనియర్ నటుడు నరేశ్, వెన్నెలకిశోర్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. ఈ చిత్రంలో షాకింగ్ సీన్ ఒకటి ఉంటుందట.
ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నరేశ్ ప్రస్తావించాడు. అయితే దీని గురించి వెన్నెల కిశోర్ మాట్లాడుతూ..రంగ్ దేలో న్యూడ్ సీన్లో నటించాను. సీన్ డిమాండ్ చేస్తే అలాంటి సీన్లలో నటించడం గురించి పెద్దగా పట్టించుకోను.
కానీ ఆ సన్నివేశాన్ని ఎలాంటి అసౌకర్యంగా అనిపించకుండా..చాలా కళాత్మకంగా షూట్ చేశారు. కానీ సెన్సార్ బోర్డు న్యూడ్ సీన్ ను తొలగించిందని వెన్నెల కిశోర్ చెప్పుకొచ్చాడు.
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను పలుకరించిన వెంకీ అట్లూరి రంగ్ దే చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు.
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత