సోమవారం 28 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 09:42:53

మ‌హేష్‌కు చిరు బ‌ర్త్‌డే విషెస్

మ‌హేష్‌కు చిరు బ‌ర్త్‌డే విషెస్

నేడు సూపర్ స్టార్ మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్బంగా సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు మ‌హేష్‌కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..మ‌హేష్‌కి బ‌ర్త్‌డే విషెస్ అందించారు. అందం, అభినయం భగవంతుడు మీకిచ్చిన వరం. మరెన్నో  మరిచిపోలేని పాత్రలు చేయాలనీ, మీ  కలలన్ని నెరవేరాలని కోరుకుంటూ, హ్యాపీ బ‌ర్త్‌డే మ‌హేష్‌. రానున్న రోజుల‌లో మీకు అంతా మంచి జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాను అని చిరు ట్వీట్ చేశారు.

మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం ఈ ఏడాది విడుద‌ల కాగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రైన సంగతి తెలిసిందే. ఆ వేడుక‌లో చిరంజీవి, మ‌హేష్‌ని ఒకే ఫ్రేంలో చూసిన అభిమానుల‌కి రెండు క‌ళ్ళు స‌రిపోలేదు. ఇద్ద‌రు క‌లిసి ఓ సినిమా చేయాల‌ని ఆకాంక్షించారు. అయితే కొద్ది రోజుల క్రితం చిరంజీవి న‌టిస్తున్న ఆచార్య సినిమాలో మ‌హేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై క్లారిటీ లేదు. 


logo