సోమవారం 25 మే 2020
Cinema - Mar 16, 2020 , 20:10:51

టాలీవుడ్‌ పెద్దదిక్కుగా చిరంజీవి కన్‌ఫర్మ్‌!

టాలీవుడ్‌ పెద్దదిక్కుగా చిరంజీవి కన్‌ఫర్మ్‌!

హైదరాబాద్:  తెలుగు సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా భావించే డా.దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే ప్రశ్నలో అందరిలోనూ వుండేది. అయితే రాజకీయాల నుండి దాదాపుగా దూరంగా వుంటున్న చిరంజీవి ఆ స్థానాన్ని తీసుకుంటే బాగుంటుందని తెలుగు సినీ పరిశ్రమ అంతా భావించింది. అయితే మొదట్లో ఈ ప్రతిపాదనకు సున్నితంగా తిరస్కరించిన చిరు...ఇప్పుడు ఆ ప్రతిపాదనను అంగీకరించి అటువైపు తన అడుగులు వేస్తున్నాడు. ఇటీవల పలు సినిమా క్రాఫ్ట్స్‌ అసోసియేషన్స్‌కు విరిగా విరాళాలు అందించిన చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై దృష్టిసారించాడు. 

ఇటీవల సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాడు. అంతేకాదు ఇటీవల ఓ ఫంక్షన్‌లో ప్రస్తుత సినిమా నటీనటులు షూటింగ్‌ సమయాల్లో  క్యారావాన్‌ల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారని.. వాళ్లలో మార్పు రావాలని సున్నితంగా హెచ్చరించాడు. అంతేకాదు కరోనా వైరస్‌ ప్రబలకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా షూటింగ్‌లు కూడా నిలిపివేయాలనేది కూడా చిరంజీవి నిర్ణయమే అని తెలిసింది. సో..ఇక టాలీవుడ్‌ పెద్దదిక్కుగా చిరు కన్‌ఫర్మ్‌ అయినట్లేనని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. logo