ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 02, 2020 , 10:54:27

వారి మృతి నా గుండెను క‌లిచివేసింది: చిరంజీవి

వారి మృతి నా గుండెను క‌లిచివేసింది:  చిరంజీవి

జన సేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో విషాదం నెలకొన్న సంగ‌తి తెలిసిందే. చిత్తూరు జిల్లా, కుప్పం లో శాంతి పురం వద్ద కటౌట్ కడుతూనే విద్యుత్ షాక్ కి గురి అయి ముగ్గురు దుర్మరణం చెందారు. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ముగ్గురు మృతి చెంద‌గా, ఏడుగురికి తీవ్ర‌గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, వ‌కీల్ సాబ్ టీం దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.  

తాజాగా ఈ ఘ‌ట‌న‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. చిత్తూర్ లో పవన్ బ‌ర్త్‌డే కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో  ముగ్గురు  మరణించటం గుండెను  కలిచివేసింది. వారి  కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు  ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.


logo