ఆచార్య సినిమా తర్వాత ఇప్పుడు అందరి చూపు చిరంజీవి (Chiranjeevi) -బాబీ కాంబినేషన్ పైనే ఉంది. ఓ వైపు లూసిఫర్ రీమేక్ షూటింగ్ ను ఈ నెలలోనే షురూ చేసేందుకు రెడీ అవుతున్నాడు చిరంజీవి . దీని తర్వాత బాబీ ( Bobby) ప్రాజెక్టు లైన్ లో ఉంది. అయితే ఇప్పటికే రీమేక్ లో నటించబోతున్న చిరంజీవికి బాబీ సినిమా కూడా మరో రీమేకేనా అని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. మల్టీ స్టారర్ గా రానున్న ఈ చిత్రంలో చిరు రియల్ లైఫ్ మెగాస్టార్ పాత్రలో కనిపించనున్నాడట.
ఓ యువ హీరో చిరంజీవి వీరాభిమానిగా కనిపించబోతున్నాడు. అయితే ఎవరు ఈ రోల్ చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ఇక చిరు-బాబీ మూవీ స్టోరీ లైన్ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన ఫ్యాన్ లాగే ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఫ్యాన్ లో షారుక్ డ్యుయల్ రోల్ లో కనిపిస్తాడు. అయితే చిరంజీవిది డ్యుయల్ రోల్ కాకపోవడంతో..ఈ మూవీ మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్ కు రీమేక్ అయి ఉంటుందన్న న్యూస్ తెరపైకి వచ్చింది.
కామెడీ డ్రామాగా తెరకెక్కిన డ్రైవింగ్ లైసెన్స్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ రియల్ లైఫ్ రోల్ ను పోషించగా..అతనికి వీరాభిమానిగా సూరజ్ వెంజరమూడు నటించాడు. ఈ స్టోరీ ఆధారంగానే చిరు-బాబీ సినిమా సాగనుందని మరో టాక్ నడుస్తోంది. ఏదేమైనా చిరును రియల్ లైఫ్ మెగాస్టార్ రోల్లో సిల్వర్ స్క్రీన్ పై చూడటం మాత్రం ఖాయమైనట్టేనని ఇప్పటివరకు వచ్చిన న్యూస్ ను బట్టి అర్థమవుతోంది.
ఇవి కూడా చదవండి..
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో