శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 18, 2020 , 07:14:17

పాట‌లు పాడి.. సాయం చేసి

పాట‌లు పాడి.. సాయం చేసి

క‌రోనా క‌ష్ట‌కాలంలో పేద‌ల‌కు, వ‌ల‌స కార్మికులకి సాయం చేసేందుకు న‌టీన‌టులు, సింగర్స్ న‌డుం బిగిస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీ పాద త‌న పాట ద్వారా వ‌చ్చిన మొత్తాన్నిఆప‌ద‌లో వారికి సాయం చేసింది. ఆమె ఔదార్యంపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

చిన్మ‌యి త‌న అభిమానుల కోరిన పాట‌లు పాడుతూ వ‌చ్చిన మొత్తాన్ని పేదలు, నిరాశ్రయులకు సాయం చేసింది. చాలా వరకు నిధులు ఇచ్చినవారే స్వయంగా సాయమందించేలా కృషి చేసింది. లాక్‌డౌన్‌ ముగిసేవరకు పాట ద్వారా తన సేవలను కొనసాగిస్తానని చిన్మయి చెప్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు రూ.30 ల‌క్ష‌ల‌కి పైగా నిధులు సేక‌రించిన‌ట్టు తెలుస్తుంది. ఇక దాదాపు 1700కుపైగా పాటలు పాడి, 1100కుపైగా కుటుంబాలకు అండ‌గా నిలిచిన చిన్మ‌యి.. లాక్‌డౌన్ ముగిసే వ‌ర‌కు త‌న పాట‌తో సేవ చేస్తాన‌ని అంటుంది.


logo