గురువారం 04 జూన్ 2020
Cinema - Apr 29, 2020 , 17:16:09

చైనాలో జూన్‌లో తెరుచుకోనున్న సినిమా థియేట‌ర్లు..

చైనాలో జూన్‌లో తెరుచుకోనున్న సినిమా థియేట‌ర్లు..

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో.. చైనాలో సినిమా థియేట‌ర్ల‌ను జ‌న‌వ‌రి నెల‌లోనే మూసివేశారు.  మూవీ మార్కెట్లో చైనా ఇండ‌స్ట్రీ రెండ‌వ అతిపెద్ద‌ది.  అయితే సినిమా హాళ్ల‌పై చైనా ఫిల్మ్ బ్యూరో  బుధ‌వారం మీడియా స‌మావేశంలో ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ఏప్రిల్ 30వ తేదీ త‌ర్వాత బీజింగ్‌లో ఎమ‌ర్జెన్సీ లెవల్స్‌ను త‌గ్గిస్తామ‌ని ఫిల్మ్ బ్యూరో డిప్యూటీ స‌మావేశంలో తెలిపారు. చైనా ఫిల్మ్ బ్యూరో డిప్యూటీ డైర‌క్ట‌ర్ వాంగ్ జువాహూ ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. జూన్ మొద‌టి వారంలో మ్యూజియంలు, ఎంట‌ర్‌టైన్మెంట్ వేదిక‌లు, మూవీ థియేట‌ర్లకు గ్రీన్‌లైట్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌దని ఆయ‌న తెలిపారు. మే నెల‌లో జ‌ర‌గ‌నున్న చైనా నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ స‌మావేశాల త‌ర్వాత దీనిపై పూర్తి క్లారిటీ వ‌స్తుంద‌న్నారు. చైనాలో సుమారు 70వేల సినిమా థియేట‌ర్లు ఉన్నాయి.  సినిమా హాళ్లు మూసివేయ‌డం వల్ల చైనాకు సుమారు 400 కోట్ల డాల‌ర్ల న‌ష్టం వ‌చ్చిన‌ట్లు వాంగ్ అంచ‌నా వేశారు. చాలా వ‌ర‌కు సినిమా కంపెనీలు దివాళా తీశాయి. అయితే ఇక నుంచి ప్ర‌భుత్వ‌మే సినిమా హాళ్ల‌ను కంట్రోల్ చేస్తుంద‌న్న ఓ శుభ‌వార్త‌ను చెప్పారు. చైనాలోనే జూన్‌లో సినిమా హాళ్లు తెరిచే అవ‌కాశం ఉన్న కార‌ణంగా.. ఇక ఇండియాలో ఇది మ‌రింత ఆల‌స్యం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.


logo