గురువారం 02 ఏప్రిల్ 2020
Cinema - Feb 16, 2020 , 23:10:36

ప్రేమ గొప్పతనంతో..

ప్రేమ గొప్పతనంతో..

సృష్టిలో అల్పప్రాణి అయిన చీమ ఓ అందాలభామతో ప్రేమలో పడితే ఏం జరిగింది? ఆ ప్రేమకథ ఎలా విజయతీరాలకు చేరుకుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే  అంటున్నారు  శ్రీకాంత్‌ శ్రీ అప్పలరాజు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చీమ ప్రేమ మధ్యలో భామ’. అమిత్‌, ఇందు జంటగా నటిస్తున్నారు.  లక్ష్మీనారాయణ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘నేటి యువతరం ప్రేమ విషయంలో ఎంత పరిణితితో ఆలోచిస్తున్నారో తెలియజేసే సినిమా ఇది.  స్వచ్ఛమైన ప్రేమ గొప్పతాన్ని  చాటిచెబుతుంది. చిన్న సినిమాల్లో వైవిధ్యమైన ప్రయత్నంగా అందరి మెప్పును పొందుతుందనే నమ్మకముంది’ అని పేర్కొన్నారు.  చాలా కాలం పాటు గుర్తుండిపోయేలా తన పాత్ర ఉంటుందని హీరో అమిత్‌ చెప్పారు. సుమన్‌, హరిత, పురంధర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:రవివర్మ, ఛాయాగ్రహణం: ఆరిఫ్‌ లలాని. logo
>>>>>>