గురువారం 26 నవంబర్ 2020
Cinema - Oct 22, 2020 , 19:37:08

సోలో హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్‌..రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్‌..!

సోలో హీరోగా చైల్డ్ ఆర్టిస్ట్‌..రీమేక్ కు గ్రీన్ సిగ్న‌ల్‌..!

టాలీవుడ్ యాక్ట‌ర్లు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేశ్ తోపాటు ప‌లువురు హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన తేజ స‌జ్జ సోలో హీరోగా తెరంగేట్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. తేజ ఇప్ప‌టికే రెండు సినిమాల‌కు సంత‌కం చేశాడు. తాజాగా మ‌రో ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టిన‌ట్టు వార్త‌లు ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. రొమాంటిక్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చి సూప‌ర్ హిట్ గా నిలిచిన మ‌‌ల‌యాళ చిత్రం ఇష్క్.  ఈ మూవీ తెలుగు రీమేక్ లో న‌టించేందుకు రెడీ అవుతున్న‌ట్టు టాక్‌.

]మెగా సూప‌ర్ గుడ్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించ‌నుండ‌గా..ద‌ర్శ‌కుడు, నటీన‌టుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. స‌మంత లీడ్ రోల్ లో న‌టించిన ఓ బేబి చిత్రంలో రామ‌కృష్ణ పాత్ర‌లో న‌టించాడు తేజ‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.