శనివారం 23 జనవరి 2021
Cinema - Dec 04, 2020 , 23:29:45

బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలేకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారో తెలుసా..?

బిగ్ బాస్ 4 తెలుగు ఫినాలేకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తున్నారో తెలుసా..?

చూస్తుండగానే బిగ్ బాస్ 4 తెలుగు చివరి దశకు వచ్చేసింది. మరో 15 రోజుల్లో సీజన్ 4 ముగిసిపోతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోకి టీఆర్పీ రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. పడుతూ లేస్తూ ఫినాలే వరకు వచ్చింది బిగ్ బాస్ జర్నీ. 106 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ డిసెంబర్ 20న ఫైనల్ జరగనుంది. ప్రస్తుతం ఇంట్లో హారిక, అవినాష్, అభిజీత్, అరియానా, అఖిల్, మోనాల్, సోహెల్ ఉన్నారు. వీళ్ళలో టాప్ 5కి ఎవరు వస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ వారం అవినాష్.. వచ్చేవారం అరియానా ఎలిమినేట్ అయిపోతారని తెలుస్తుంది. ఈ లెక్కన టాప్ ఫైవ్ లో హారిక, అభిజీత్, అఖిల్, మోనాల్, సోహెల్ ఉంటారన్నమాట. 

దానికి తోడు ఫినాలే టికెట్ అఖిల్, సోహైల్ లలో ఎవరో ఒకరు దక్కించుకుంటారు. ఎలా చూసుకున్నా కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ప్రేక్షకులు ఊహించినట్లే ఉండబోతున్నారు. ఈసారి కూడా అభిజిత్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సీజన్ ఫినాలే కోసం ముగ్గురు స్టార్ హీరోలలో ఒకర్ని అతిథిగా పిలిచే ఆలోచనలో ఉన్నారు సార్ మా యాజమాన్యం. రెండో సీజన్ ఫైనల్ కు వెంకటేష్ వచ్చాడు.. మూడో సీజన్ ఫైనల్ కోసం చిరంజీవి వచ్చాడు. వీళ్ళ చేతుల మీదుగా బిగ్ బాస్ టైటిల్స్ అందుకున్నారు విజేతలు. ఈ సారి ఫైనల్ కు జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని ప్రచారం జరుగుతుంది. పైగా ఆయన తొలి సీజన్ ను హోస్ట్ చేశాడు. 

ఈ అనుబంధంతో కచ్చితంగా ఫైనల్ కు రావడానికి ఎన్టీఆర్ ఒప్పుకుంటాడని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మహేష్ బాబు, అల్లు అర్జున్ తో కూడా స్టార్ మా యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఈ సీజన్ ఫైనల్ కు ఈ ముగ్గురు స్టార్ హీరోల్లో ఎవరో ఒకరు వస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ ముగ్గురిలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన కుదరని పక్షంలో మిగిలిన ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తారు. దానికితోడు ఫినాలే ఎపిసోడ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు స్టార్ మా యాజమాన్యం. గత సీజన్ లతో పోలిస్తే ఈ సారి మరింత ఘనంగా ముగించాలని చూస్తున్నారు. మొత్తానికి చూడాలి మరి బిగ్ బాస్ ఫినాలే ఎలా ఉండబోతుందో..?


logo