ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Cinema - Jan 27, 2021 , 00:34:08

బాధ్యతల్ని విస్మరిస్తే..

బాధ్యతల్ని విస్మరిస్తే..

ఆర్యన్‌కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన  చిత్రం ‘చెప్పినా ఎవరూ నమ్మరు’. ఎం.మురళీ శ్రీనివాసులు నిర్మాత. సుప్యార్థసింగ్‌ కథానాయిక. ఈ నెల 29న  విడుదలకానుంది. ఆర్యన్‌కృష్ణ మాట్లాడుతూ ‘రొమాంటిక్‌ క్రైమ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. బాధ్యతల్ని విస్మరించి కొత్త జీవితాల్ని మొదలుపెట్టాలని కలలుకన్న ముగ్గురు యువకుల జీవనగమనానికి దృశ్యరూపంగా ఉంటుంది? వారిలో మార్పుకు దారితీసిన పరిస్థితులు ఆలోచిం పజేస్తుంది. సినిమా రూపకల్పనలో దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి చక్కటి సలహాలిచ్చారు’ అని చెప్పారు. యువత అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన చిత్రమిదని నిర్మాత చెప్పారు. కంటెంట్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని పంపిణీదారుడు శ్రీనివాస్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో సుప్యార్థసింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo