బుధవారం 27 మే 2020
Cinema - May 21, 2020 , 13:34:16

అమెరికా చెఫ్‌ వంటకానికి సోనూసూద్‌ ఊరిపేరు!

అమెరికా చెఫ్‌ వంటకానికి సోనూసూద్‌ ఊరిపేరు!

రీల్‌ లైఫ్‌లో విలన్‌ అయినా రియల్‌ లైఫ్‌లో మాత్రం హీరో అనిపించుకున్నాడు సోనూ సూద్‌. కరోనాకాలంలో పేదప్రజలకు అండగా నిలిచాడు. ముంబైలోని తన హోటల్‌లో వైద్య సిబ్బందికి బస ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత పంజాబ్‌లోని వైద్యులకు వ్యక్తిగత రక్షణ కిట్లు కూడా అందించాడు. అంతేకాదు ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను పది బస్సుల్లో వారి గ్రామాలకు పంపించాడు. లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న వారికి ఎన్నో సేవలు అందిస్తూ అందరిలో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు సోనూసూద్‌.

ఇతని సేవలకు అమెరికాలోని ప్రఖ్యాత చెఫ్‌ వికాస్‌ ఖన్నా కృతజ్ఞతలు తెలుపుతూ తన ైస్టెల్‌లో కొత్త రకం వంటకం చేశాడు. దీనికి సోనూసూద్‌ సొంత ఊరి పేరు ‘మోగా’ అని పెట్టాడు. ‘డియర్‌ సోనూ భాయ్‌ మీరు ఎందరికో ఆదర్శం. మీకు స్వయంగా నా చేతులతో వండి పెట్టాలనుంది. కానీ అది జరగదు. అందుకే ఈ వంటకానికి మీ ఊరి పేరు పెట్టి నా కోరికను తీర్చుకుంటున్నాను’ అని చెప్పాడు. ఈ వంటకం ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు చెఫ్‌. ఈ విషయం తెలుసుకున్న హీరో సోనూసూద్‌ ఆనందం వ్యక్తం చేశాడు. దీంతో మా గ్రామం ఎంతో గర్వపడుతుంది అని సోనూ పేర్కొన్నాడు.logo