శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 10:39:23

ఒరేయ్ బుజ్జిగా ట్రైల‌ర్ విడుద‌ల చేసిన చైతూ

ఒరేయ్ బుజ్జిగా ట్రైల‌ర్ విడుద‌ల చేసిన చైతూ

రాజ్ తరుణ్‌, మాళవికా నాయర్, హెబ్బా ప‌టేల్‌ నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకుడు.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న ఆహా ఓటీటీ ద్వారా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది.  కుటుంబ విలువలతో ముడిపడిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం  రూపొంద‌గా, తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది.

అక్కినేని నాగ చైత‌న్య త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఒరేయ్ బుజ్జిగా చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఇది చూస్తుంటే చిత్రంలో మ‌న‌ల్ని నవ్విస్తూనే మనసుల్ని కదిలించే భావోద్వేగాలుంటాయని తెలుస్తుంది . రాజ్‌తరుణ్‌, మాళవికానాయర్‌ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసానికృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్‌ రూబెన్స్ అందించారు. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. logo