శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Apr 27, 2020 , 15:08:50

చావు క‌బురు చ‌ల్లాగా వ‌ర్కింగ్ స్టిల్స్‌

చావు క‌బురు చ‌ల్లాగా వ‌ర్కింగ్ స్టిల్స్‌

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో, బ‌న్నివాసు నిర్మాత‌గా జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో కార్తికేయ హీరోగా న‌టిస్తున్న చిత్రం చావు క‌బురు చ‌ల్లాగా వ‌ర్కింగ్ స్టిల్స్‌ . గీతాఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో పిల్లా  , భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సివాలా, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన జిఏ2  బ్యానర్ పై ఇంటిలిజెంట్ ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాత‌గా, ఆర్‌.ఎక్స్ 100 సినిమాతో న‌టుడిగా మంచి క్రేజ్‌ తెచ్చుకున్న కార్తికేయ హీరోగా , ల‌క్కిబ్యూటి లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్ గా  కౌశిక్ పెగళ్లపాటి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం చావుక‌బురు చ‌ల్ల‌గా.. చిత్రం లాక్‌డౌన్ కి ముందు మెద‌టి షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది. ఈ చిత్రం రొమాంటిక్ డార్క్ హ్యూమ‌ర్ జొన‌ర్ లో తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలోని ప్ర‌తి పాత్ర చాలా నేచుర‌ల్ గా ప్ర‌తి ఓక్క‌రి జీవితాల‌కి ద‌గ్గ‌ర‌గా వుంటాయి. 

ఈ సినిమా చూసిన త‌రువాత వాళ్ళ పాత్ర‌లు కొన్ని రోజులు ప్రేక్ష‌కుడితో ట్రావ‌ల్ అవుతాయ‌న‌టంలో సందేహం లేద‌ని యూనిట్ న‌మ్మ‌కాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. ఈ చిత్రం యెక్క వ‌ర్కింగ్ స్టిల్స్ ఈరోజు విడుద‌ల చేశారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు.. అలాగే ప్ర‌ముఖ కెమెరామెన్ సునిల్ రెడ్డి త‌న సినిమాటొగ్ర‌ఫి ని అందిస్తున్నారు, ఎడిట‌ర్ గా స‌త్య‌, ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ మ‌నీషా ఏ ద‌త్, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్ గా రాఘ‌వ క‌రుటూరి లు బాద్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో న‌టీన‌టులు.. కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని, శ్రీకాంత్ అయ్యంగ‌ర్‌, మ‌హేష్‌, భ‌ద్రం త‌దిత‌రులు న‌టిస్తున్నారు..


బ్యానర్ : GA2 pictures

సమర్పణ : అల్లు అరవింద్ 

సంగీతం.. జేక్స్ బిజోయ్‌

కెమెరా.. సునీల్ రెడ్డి,

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.. మ‌నీషా ఏ ద‌త్‌

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్.. రాఘ‌వ క‌రుటూరి

ఎడిట‌ర్‌..స‌త్య‌

పి ఆర్ ఒ.. ఏలూరు శ్రీను

నిర్మాత : బన్నీ వాసు

డైరెక్టర్ : కౌశిక్ పెగళ్లపాటి


logo