సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 02, 2020 , 11:08:11

లాక్‌డౌన్‌లో చార్మి పెళ్లి అయిపోయిండేది.. వరుడు ఎవరంటే?

లాక్‌డౌన్‌లో చార్మి పెళ్లి అయిపోయిండేది.. వరుడు ఎవరంటే?

అగ్రహీరోల సరసన హీరోయిన్‌గా నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న చార్మి కౌర్‌ ఇప్పుడు నిర్మాతగా కూడా పలు విజయాలు అందుకుంటున్నది. సినిమాల్లో నటనకు దూరమైన తర్వాత డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో కలిసి ‘పూరి కనెక్ట్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో భారీ సక్సెస్‌ సాధించి లాభాల బాట పట్టిన ఈ అమ్మడు బ్యానర్‌ బాధ్యతలు అన్నీ చూసుకుంటూ కెరీర్‌లో సెటిల్‌ అయింది. చార్మి ఇక పెళ్లి చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

కెరీర్‌లో సెటిల్‌ అయ్యేందుకు 33 ఏండ్ల వరకు పెండ్లి చేసుకోలేదు చార్మి. గతంలో ఓ ఇంటర్వూలో పెళ్లిపై స్పందించిన చార్మి.. ‘నా పెళ్లి బాధ్యతలన్నీ తల్లిదండ్రులపైనే వదిలేసా.. వారు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారినే చేసుకుంటా అని చెప్పింది’. ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నది. అసలు ఈ పాటికే చార్మి పెళ్లి అయిపోవాల్సింది. కాకపోతే లాక్‌డౌన్‌ కారణంగా పెళ్లి వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చార్మి పెళ్లిపై వస్తున్న పుకార్లకు అభిమానులు నిజమా! వరుడు ఎవరంటూ.. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. మరి ఈ వార్తల వెనుక దాగున్న నిజం ఎంత వరకు నిజమో.. చార్మి స్పందించే వరకు వేచిచూడాల్సిందే..!


logo