బుధవారం 03 జూన్ 2020
Cinema - May 19, 2020 , 23:02:09

‘ఫైటర్‌'లో ఎమోషన్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది!

‘ఫైటర్‌'లో ఎమోషన్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది!

విజయ్‌దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఫైటర్‌' సినిమాలో యాక్షన్‌ హంగులతో పాటు కంటతడి పెట్టించే భావోద్వేగభరిత సన్నివేశాలుంటాయని చెప్పింది ఛార్మి. ఈ సినిమా నిర్మాతల్లో ఆమె ఒకరు. పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్నారు. ఇటీవల సోషల్‌మీడియా ద్వారా ముచ్చటించిన ఛార్మి ‘ఫైటర్‌' గురించిన పలు ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుంది. ‘ఈ సినిమాలో యాక్షన్‌, ఫైట్స్‌ మాత్రమే కాదు. మదర్‌సెంటిమెంట్‌ ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది. విజయ్‌, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు హృద్యంగా ఉంటాయి. ఈ సినిమాకు మలేషియా ఫైటర్‌ పనిచేస్తున్నాడు. అతనికి తెలుగురాదు. షూటింగ్‌ సందర్భంలో విజయ్‌, రమ్యకృష్ణ తీసిన సీన్స్‌ చూసి అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు.సింగిల్‌ సిట్టింగ్‌లో విజయ్‌ ఈ కథను ఓకే చేశారు. కథానుగుణంగా తన శరీరాకృతిని తీర్చిదిద్దుకున్నాడు. ఈ పాత్రలో విజయ్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. ఇప్పటివరకు జరిగిన రషెస్‌ చూస్తుంటే విజయ్‌ కోసమే ఈ కథ పుట్టిందా అనిపించింది’ అని పేర్కొంది ఛార్మి. లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌జోహార్‌ ఓ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు.logo