బుధవారం 03 జూన్ 2020
Cinema - May 17, 2020 , 15:09:30

ప్రియ‌మైన వారితో బ‌ర్త్‌డే జ‌రుపుకున్న ఛార్మీ

ప్రియ‌మైన వారితో బ‌ర్త్‌డే జ‌రుపుకున్న ఛార్మీ

ఒక‌ప్పుడు హీరోయిన్‌గా అల‌రించిన అందాల భామ ఛార్మీ ప్ర‌స్తుతం పూరీ క‌నెక్ట్స్ బేన‌ర్‌పై ప‌లు సినిమాలు నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన ఛార్మీ త్వ‌ర‌లో ఫైట‌ర్ అనే సినిమాని అభిమానుల ముందుకు తీసుకు రానుంది. ఫైట‌ర్ చిత్రం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్క‌నుండ‌గా, ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు.

ఈ రోజు ఛార్మీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి త‌న ప్రియ‌మైన వారికి తినిపించింది. అంతేకాక అభిమానుల నుండి ఎన్నో మెసేజెస్‌, వీడియా కాల్స్ వ‌చ్చాయ‌ని పేర్కొంది. రానున్న రోజుల‌లోను ఇలాంటి అభిమాన‌మే చూపించాల‌ని కోరింది. ప్ర‌స్తుతం ఛార్మీ బ‌ర్త్‌డే ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.


logo