తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నాడు.ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన లుక్స్ విడుదల కాగా, పోస్టర్స్ మెగా ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ రామ్ చరణ్‌పై వదిలిన టీజర్ మెగా ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుంది. ఇక రీసెంట్గా దోస్తీ అంటూ ఓ ప్రమోషనల్ వీడియో సాంగ్ విడుదల చేయగా, ఈ పాట చివరలో చరణ్, ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని చాలా మంది కామెంట్స్ పెట్టారు. తాజాగా బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ .. ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది అని కామెంట్ చేశారు.
ఎన్టీఆర్ లుక్ కూడా నందమూరి అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్‌ల ఫస్ట్‌లుక్ కూడా వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి మరో మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా ఏళ్లుగా స్టిక్ అయిన రామ్ చరణ్, ఎన్టీఆర్ త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు చేయనున్నారు.చరణ్…శంకర్ తో ఎన్టీఆర్..కొరటాలతో సినిమా చేయనున్నాడు.