శనివారం 30 మే 2020
Cinema - Apr 25, 2020 , 00:07:07

ఆలోచించండి ఆవేశం మానుకోండి

ఆలోచించండి ఆవేశం మానుకోండి

కరోనా వైరస్‌ వ్యాప్తిని  నిరోధించేందుకు ధైర్యంగా తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీసులకు ప్రజలందరూ సహకరించాలని పాట రూపంలో పిలుపునిచ్చారు గేయరచయిత చంద్రబోస్‌. కరోనా కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహణ విధానం చాలా గొప్పగా ఉందని ఆయన  తెలిపారు. చాలా మంది ప్రజలు వారికి సహకరిస్తున్నారని,  కొంత మంది అడ్డు తగులుతున్నారని చంద్రబోస్‌ అన్నారు.  నియయాల్ని అతిక్రమిస్తున్న వారిలో అవగాహన కల్పిస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ సజ్జనార్‌ కోరిక మేరకు గేయరచయిత చంద్రబోస్‌ ఓ పాటను రాశారు.  ‘ఆలోచించండి అన్నలారా.. ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా. రక్షించే పోలీసును రాళ్లతోటి  కొడతారా.. ప్రాణాలర్పించే  పోలీసును పగవాడిగా చూస్తారా..ఆలోచించండి అన్నలారా.. మంచిచేయబోతే ఆ చేయిని నరికేస్తారా.. అమ్మలాగా ఆదరిస్తే ముఖాన ఉమ్మేస్తారా.. ఆలోచించండి అన్నలారా.. నిద్రాహారాలు మాని మీ భద్రత చూశాడు.. జబ్బు తనకు అంటుద్దని తెలిసి అడుగులేశాడు.. కన్నబిడ్డలను వదిలి కంచె మీకు కట్టాడు.. కసిరి మీరు తిడుతున్నా కవచమల్లే  నిలిచాడు.. త్యాగానికి మెచ్చి మెడలో హారమేయమనలేదు. తను చేసే పనిలో మీ సహకారం కోరాడు. ఆలోచించండి అన్నలారా. ఆవేశం మానుకోండి తమ్ముళ్లారా’ అంటూ చంద్రబోస్‌ రాసిన ఈ పాట ప్రతి ఒక్కరిలో ఆలోచింపజేస్తోంది. 


logo