చమ్మక్‌చంద్ర, మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రామసక్కనోళ్లు’. ఫహీమ్ సర్కార్ దర్శకుడు. రమణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం హైదరాబాద్‌లో విడుదలచేశారు. ఈ సందర్భంగా చమ్మక్‌చంద్ర మాట్లాడుతూ ‘నలుగురు కుర్రాళ్ల కథ ఇది. ఊరి బాగు కోసం వారు ఎలాంటి పోరాటం చేశారన్నది ఆకట్టుకుంటుంది. నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుంది. ఘంటాడి కృష్ణ సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది. వందశాతం వినోదాన్ని పంచుతుంది’ అని తెలిపారు. పల్లెల్లో ఉండే అనుబంధాలు, ఆప్యాయతల కలబోతగా సాగే చిత్రమిదని నిర్మాత అన్నారు.