శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 02:06:48

చలాకీ పిల్ల కహానీ

చలాకీ పిల్ల కహానీ

సింగిల్‌పీస్‌..హైబ్రీడ్‌పిల్లా అంటూ యువతరం హృదయాల్ని కొల్లగొట్టింది తమిళ చిన్నది సాయిపల్లవి. తెరపై ఆద్యంతం సందడి చేసే చలాకీ అమ్మాయి పాత్రలతో పాటు మనసును కదిలించే అభినయప్రధాన పాత్రల్లో అలవోకగా ఒదిగిపోతుందని పేరు తెచ్చుకుందీ అమ్మడు. తాజాగా సాయిపల్లవి తెలుగులో పూర్తిస్థాయి మహిళా ప్రధాన చిత్రంలో నటించబోతున్నదని తెలిసింది. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే ఈ సినిమాలో సాయిపల్లవి పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన చలాకీ అమ్మాయిగా సాయిపల్లవి పాత్ర నవ్యరీతిలో సాగుతుందని అంటున్నారు. కథతో పాటు తన పాత్రచిత్రణలోని నవ్యత నచ్చడంతో ఈ సినిమాను సాయిపల్లవి వెంటనే అంగీకరించిందని తెలిసింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని సమాచారం. నవంబర్‌ నెలలో ఈ సినిమాను సెట్స్‌మీదకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సాయిపల్లవి తెలుగులో ‘లవ్‌స్టోరీ’ ‘విరాటపర్వం’ చిత్రాల్లో నటిస్తున్నది.

తాజావార్తలు