స్వర బ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్బుతమైన బాణీలతో శ్రోతలను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, గోపిచంద్ సీటీమారం, రామ్ 19వ చిత్రాలతో బిజీగా ఉన్నారు.అయితే మణిశర్మ బర్త్ డే సందర్భంగా నారప్ప చిత్రం నుండి చలాకీ చిన్మమ్మి అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది.
నారప్ప చిత్రం తమిళ సూపర్ హిట్ మూవీ అసురన్‌కు రీమేక్‌గా తెరకెక్కింది. విక్టరీ వెంకటేశ్, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి జంటగా నటిస్తున్న సినిమా ‘నారప్ప’ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ బాబుతో కలిసి కలైపులి ఎస్. థాను దీనిని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్వరబ్రహ్మ మణిశర్మ స్వరాలు సమకూర్చారు. కార్తీక్ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘నారప్ప’ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. ఈ చిత్రం ఓటీటీలో విడుదల కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.