e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

సినిమా ఇండస్ట్రీ అంటేనే అద్దాల మేడలా కనిపిస్తుంది. ఎప్పుడు అది పగిలిపోతుందో తెలియదు. అంత సున్నితంగా ఉంటాయి సినిమా వాళ్ల జీవితాలు. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ముందు వాళ్లు ఆలోచించేది చావు గురించే. అందుకే ఎక్కడా లేనట్లుగా సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఆత్మహత్యలు చూస్తుంటాం. ఇప్పుడు కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. కన్నడ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ చైత్ర కొట్టూరు సూసైడ్ అటెంప్ట్ చేసింది. కోలార్లోని తన ఇంట్లోనే ఆమె ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యయత్నం చేసింది చైత్ర. ఈ విషయాన్ని గమనించిన అక్కడి స్థానికులు వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చైత్రకు ఫస్ట్ ఎయిడ్ అందించారు. చనిపోవడానికి ఫినాయిల్ తాగింది చైత్ర. దాంతో వెంటనే తాగిన మందు మొత్తం బయటికి తీసారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆమె ఆరోగ్యానికి ప్రస్తుతానికి ఏం ప్రమాదం లేదని.. ఔట్ ఆఫ్ డేంజర్ అని తెలిపారు. అయితే అలా చేయడానికి కారణాలేంటి అనేది మాత్రం పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఆమె దగ్గర్నుంచి కూడా కంప్లైంట్స్ తీసుకున్నారు. 2021, మార్చి 28న నాగార్జున అనే బిజినెస్ మ్యాన్ ను ఈమె ఓ గుడిలో పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లైన రెండు మూడు రోజులకే ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని తెలుస్తుంది.

ఈమెను వివాహం చేసుకోవడం నాగార్జునకు ఇష్టం లేదని.. చైత్ర బలవంతం చెయ్యడంతో అతను పెళ్లి చేసుకున్నాడని నాగార్జున కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ నాగార్జున వెంట పడటం.. ప్రేమిస్తున్నానని చెప్పడం వల్లే అతడిని చైత్ర పెళ్లి చేసుకుందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఇక్కడ తప్పు ఎవరిది అనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ‘సుజీదార’ అనే కన్నడ చిత్రంలో కీలక పాత్ర పోషించింది చైత్ర. దాంతో పాటు బిగ్ బాస్ లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె ఆత్మహత్యాయత్నం వ్యవహారం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈమె హాస్పిటల్ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయిప్పుడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం

ట్రెండింగ్‌

Advertisement