కొన్ని సినిమాలు థియేటర్స్ లో అప్పుడున్న పరిస్థితుల ప్రభావమో ఏమో కానీ నచ్చవు. కానీ అవే సినిమాలు టీవీలో వచ్చినపుడు బాగా చూస్తుంటారు. ఇప్పుడు టీవీల స్థానంలో ఓటిటి వచ్చింది. థియేటర్స్ లో విడుదలైనా కూడా ఆడని సినిమాలు ఓటిటిలో మాత్రం అదరగొడుతున్నాయి. ఈ మధ్యే నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఎప్రిల్ 2న ఈ చిత్రం విడుదలైంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం రప్ఫాడిస్తుంది. అక్కడ ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు ఇదే దారిలో చావు కబురు చల్లగా సినిమా కూడా సాగుతుంది. కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చ్ 19న విడుదలైంది.
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 నిర్మించింది. వాళ్ల బ్యానర్ లో తొలి డిజాస్టర్ ఇది. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సాగుతున్న గీతా ఆర్ట్స్ కే ఫ్లాప్ కబురు చల్లగా చెప్పింది ఈ చిత్రం. కార్తికేయ కూడా ఈ చిత్రం ఫ్లాప్ అయిందని.. ఎక్కడో తప్పు జరిగిందని.. మరో అవకాశం ఇవ్వాలంటూ కోరుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేసారు. ఓటిటి ఆడియన్స్ కోసం కాస్త మార్చి.. రీ ఎడిట్ చేసి మరీ చావు కబురు చల్లగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
థియేటర్స్ లో ఫ్లాప్ అయిన ఈ చిత్రానికి అనూహ్యంగా ఆహాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. విడుదలైన 72 గంటల్లో అంటే మూడు రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ దక్కించుకుంది చావు కబురు చల్లగా. అంటే 10 కోట్ల నిమిషాలన్నమాట.. ఇది నిజంగానే చాలా పెద్ద హిట్ అన్నమాట. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ ఓటిటిలో విజయం సాధించడంతో కార్తికేయ కాస్త హ్యాపీగా ఉన్నాడు. ఏదేమైనా కూడా కాస్త మార్పులు చేసుంటే థియేటర్స్ లో కూడా బస్తీ బాలరాజు రప్ఫాడించేవాడు. కానీ మిస్ అయింది.. పోనీలే.. అక్కడ మిస్సైనా ఇక్కడ మిస్ కాలేదు.
ఇవి కూడా చదవండి..
మూడో హిందీ చిత్రానికి రష్మిక గ్రీన్ సిగ్నల్..!
హీరోహీరోయిన్లకు బ్యాడ్ న్యూస్..అక్కడికి రాకపోకలు బంద్..!
అల్లు ‘సిటీమార్’ కి సల్లు న్యాయం చేశాడా ?
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…