ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 13:47:23

సుశాంత్ కేసు: సీ‌బీఐ ద‌ర్యాప్తుని అంగీక‌రించిన కేంద్రం

సుశాంత్ కేసు: సీ‌బీఐ ద‌ర్యాప్తుని అంగీక‌రించిన కేంద్రం

దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసుపై సిబిఐ దర్యాప్తు కోసం బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసు  కేంద్రం అంగీక‌రించిన‌ట్టు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సుశాంత్ తండ్రి కెకె సింగ్ విజ్ఞ‌ప్తి మేర‌కు బీహార్ ముఖ్యమంత్రి కేంద్రానికి అభ్యర్థన పంపిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన రావ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే సిబిఐ ఇప్పుడు దర్యాప్తును చేపట్టనుంది.

సిబిఐ విచారణ కోసం బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టు ముందు పేర్కొన్నారు. దర్యాప్తును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయమని ఆదేశిస్తూ రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌ను విచారించిన‌ సుప్రీం కోర్టు ఈ నిర్ణ‌యాన్ని తీసుకుంది.

అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించిన కేసులో నిజానిజాలు బయటికి రావాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు బీహార్ పోలీసు అధికారిని క్వారంటైన్ చేయడం మంచి సంకేతం కాదని పేర్కొంది. దీనిపై ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తాజా నిర్ణ‌యంతో సుశాంత్ కుటుంబ స‌భ్యులు, ఆయ‌న అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. సుశాంత్‌కి న్యాయం జ‌రుగుతుంద‌ని వారు భావిస్తున్నారు.


logo