ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 13, 2020 , 16:01:10

త్వ‌ర‌లో సినిమా థియేట‌ర్లు రీఓపెన్ కానున్నాయా..?

త్వ‌ర‌లో సినిమా థియేట‌ర్లు రీఓపెన్ కానున్నాయా..?

క‌రోనా నేప‌థ్యంలో లాక్ డౌన్ అమ‌లవ‌డంతో దేశ‌వ్యాప్తంగా ఎప్పుడూ సంద‌డిగా ఉండే సినిమా థియేట‌ర్లు మూతప‌డిన విష‌యం తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ తో థియేట‌ర్ల గేట్లు మూసుకుని 3 నెల‌ల‌కుపైనే అవుతుంది. అయితే ఆ త‌ర్వాత ద‌శ‌ల‌వారీగా లాక్ డౌన్ ను ఎత్తివేసింది కేంద్రం. అన్ లాక్ అమ‌ల‌వుతున్నా..మ‌రోవైపు ప‌లు రాష్ట్రాల్లోని న‌గ‌రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల రీఓపెనింగ్ పై డైలామా కొన‌సాగుతూనే ఉంది. అయితే కేంద్రం ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌ను రీఓపెన్ చేసుకునేందుకు అనుమ‌తివ్వాల‌ని స‌మాలోచ‌న‌లు చేస్తోన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

దేశ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 1 నుంచి థియేట‌ర్ల‌ను షురూ చేయాల‌ని కేంద్రం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌యోప‌రిమితి ఆధారంగా థియేట‌ర్ల‌లోకి అనుమ‌తించేందుకు మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందిస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌తీ రోజు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేట‌ర్లు ఓపెన్ చేయాల్సి వ‌స్తే..కేసుల తీవ్ర‌త మ‌రింత అవ‌కాశాలుంటాయి. కానీ ప‌లు ప్రాంతాల్లో ప్ర‌భుత్వాలు లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేశాయి. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్లు రీఓపెన్ చేయ‌డం ఎంతవ‌ర‌కు సాధ్యమ‌వుతుంద‌ని వేచి చూడాలి. 



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo