బుధవారం 23 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 09:58:22

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేసిన సెల‌బ్రిటీలు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేసిన సెల‌బ్రిటీలు

టాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సెల‌బ్రిటీలు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా 74 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈ స‌మ‌యంలో అమ‌ర‌వీరుల త్యాగాలు గుర్తు చేసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌ని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మ‌హేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, ర‌వితేజ, క‌ళ్యాణ్ రామ్, అల్లు అర్జున్, మోహ‌న్ బాబు,సుధీర్ బాబు, జ‌గ‌ప‌తి బాబు ఇలా ప‌లువురు ప్రముఖులు శుభాకాంక్ష‌లు అందించారు.

మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ.. మ‌న‌కు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన వీరుల త్యాగాల‌ను గుర్తు తెచ్చుకుందాం. వారు మ‌న‌కోసం సంపాదించిన విలువైన స్వేచ్ఛ‌ను కాపాడుకుందాం అని అన్నారు. 

కొత్త ఆరంభం ప్రారంభమైన రోజు ... స్వాతంత్ర్యం మనకి గొప్ప విజయంగా మారినప్పుడు స్వేచ్ఛ మ‌న‌కు దారిని చూపిస్తుంది.  ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. నాతోటి భార‌తీయులంద‌రికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని మ‌హేష్ ట్వీట్ చేశారు.


logo