దొరస్వామి పార్దీవ దేహానికి ప్రముఖుల నివాళులు

ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి సోమవారం ఉదయం వయోభారం కారణంగా తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివని పలువురు ప్రముఖులు కొనియాడారు. సింహాద్రి సినిమా మంచి విజయం సాధించడంలో ఆయన పాత్ర ఎంతో కీలకం అని రాజమౌళి, ఎన్టీఆర్ అన్నారు.
అభిమానుల సందర్శనార్దం దొరస్వామి పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్లో ఉంచారు. రాజమౌళి, మురళీ మోహన్, అశ్వినీదత్‌తో పాటు పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మహా ప్రస్థానంలో దొరస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో భక్తిప్రధాన కథాంశంతో రూపొందించిన ‘అన్నమయ్య’ చిత్రం నిర్మాతగా దొరస్వామిరాజుకు ఎనలేని పేరుప్రఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. రెండు జాతీయ పురస్కారాలతో పాటు ఎనిమిది నంది అవార్డులను ఈ సినిమా గెలుచుకుంది.వీఎంసీ ప్రొడక్షన్స్ సంస్థపై ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఆయన రూపొందించిన ‘సింహాద్రి’ కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ సినిమాలతో పాటు ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, మాధవయ్యగారి మనవడు, భలేపెళ్లాం, వెంగమాంబ లాంటి చిత్రాలతో అభిరుచి కలిగిన నిర్మాతగా పేరుతెచ్చుకున్నారు.
ఫిలింఛాంబర్ లో దొరస్వామి రాజు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖులు. 11 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు. #DoraswamyRaju pic.twitter.com/WEmaimUiFV
— BARaju (@baraju_SuperHit) January 19, 2021