మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 25, 2020 , 14:30:18

స్వ‌ర సామ్రాట్‌కు సెల‌బ్రిటీల‌ ఘ‌న నివాళులు

స్వ‌ర సామ్రాట్‌కు సెల‌బ్రిటీల‌ ఘ‌న నివాళులు

సినీ సంగీత ప్ర‌పంచంలో మ‌హా వృక్షం ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం. ఘంట‌సాల త‌ర్వాత అమ‌ర‌గాయ‌కుడిగా పేరొందిన బాలు ..మేలు కొలిపే పాట, జోల పాడే పాట, భ‌క్తి పాట‌, రొమాంటిక్ పాట ఇలా ఒక‌టి కాదు ఎన్నో సాంగ్స్ పాడారు. అత్య‌ధిక పాట‌లు పాడిన సింగ‌ర్‌గా గిన్నీస్ రికార్డ్ సాధించిన బాలు కొద్ది సేప‌టి క్రితం స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. ఆయ‌న మ‌ర‌ణం ప్ర‌పంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. టాలీవుడ్‌, బాలీవుడ్ , కోలీవుడ్, శాండ‌ల్ వుడ్ ఇలా అన్ని ఇండ‌స్ట్రీల‌కు చెందిన ప్ర‌ముఖులు ఆయ‌న‌కు ఘ‌న నివాళులు అర్పిస్తున్నారు.

బాలుతో ఉన్న‌ అనుబంధాల‌ని గుర్తు చేసుకుంటూ భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు అంద‌రు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా సంతాపం తెలియ‌జేస్తున్నార‌. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. logo