గురువారం 04 జూన్ 2020
Cinema - Mar 19, 2020 , 12:48:21

క‌లెక్ష‌న్ కింగ్‌ మోహ‌న్ బాబుకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల వెల్లువ‌

క‌లెక్ష‌న్ కింగ్‌ మోహ‌న్ బాబుకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌ల వెల్లువ‌

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న న‌టుల‌లో మోహ‌న్ బాబు ఒక‌రు. విల‌న్‌గా చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోహ‌న్ బాబు ఆ త‌ర్వాత  హీరోగా రాణించి ఎంద‌రో అభిమానుల అభిమానాన్ని పొందారు. ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన పాత్ర‌లతో అల‌రిస్తున్న‌ మోహ‌న్ బాబు నేడు త‌న 70వ జ‌న్మ‌దినాన్ని జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు సోష‌ల్ మీడియా ద్వారా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. నలభై నాలుగేళ్ల ఏళ్ల క్రితం ‘స్వర్గం నరకం’తో  ఈ న‌ట ప్ర‌పూర్ణుని న‌ట ప్ర‌స్థానం మొద‌లైన విష‌యం తెలిసిందే. 

ప్ర‌తి ఏడాది  మార్చి 19న జరగాల్సిన శ్రీ విద్యానికేతన్‌ పాఠశాల, కళాశాలల వార్షికోత్సవంతో పాటు  మోహ‌న్ బాబు పుట్టిన రోజు వేడుకలు ఘ‌నంగా జ‌రుగుతూ వ‌స్తున్నాయి.  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని వాయిదా వేయడం జరిగిందని మోహన్‌ బాబు ఇటీవ‌ల‌ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ఆత్మీయ విన్నపంతో పేరుతో లేఖను విడుదల చేశారు.  కరోనా వైరస్‌ భూభాగం నుంచి నిష్క్రమించే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోండి అని సూచించారు.   logo