బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 20, 2020 , 09:47:51

నిర్భ‌య దోషుల ఉరిపై స్పందించిన సెల‌బ్రిటీలు

నిర్భ‌య దోషుల ఉరిపై స్పందించిన సెల‌బ్రిటీలు

ఎట్ట‌కేల‌కి ఈ రోజు తెల్ల‌వారుఝామున నిర్భ‌య దోషుల‌కి ఉరి శిక్ష‌ ప‌డింది. దాదాపు ఏడేళ్ళ‌నుండి ఎన్నో కుయుక్తుల‌తో త‌ప్పించుకుంటూ వ‌స్తున్న న‌లుగురు దోషుల‌ని పారామిలటరీ బలగాల భద్రత మధ్య ఢిల్లీలోని తిహార్ జైలులో ఉరి తీశారు. ఆ క్ష‌ణం దేశం మొత్తం హ‌ర్షించింది. ముఖ్యంగా నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆనందం వ్య‌క్తం చేస్తూ,  త‌న కుమార్తె ఆత్మ నేడు శాంతిస్తుంద‌ని పేర్కొంది. నిర్భ‌య కేసు తీర్పు మ‌హిళ‌ల విజ‌యం అని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా త‌మ సోష‌ల్ మీడియా వేదిక‌గా నిర్భ‌య దోషుల‌కి శిక్ష ప‌డ‌టంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

ప్ర‌ముఖ టాలీవుడ్ నిర్మాత పీవీపీ త‌న ట్విట్ట‌ర్‌లో  ..  "ధర్మ సంస్థాపనాయ సంభావామి యుగే యుగేష‌. ఏడేళ్ల శని వదిలింది. చరిత్రలో నిర్భయ, దిశ మళ్ళీ పునరావృతం కాకూడదు. జైహింద్’ అని  ట్వీట్ చేశారు. ‘ఎట్టకేలకు నిర్భయ కేసుకు ముగింపు పలికారు. ఈకేసులో తీర్పురావడం ఆలస్యం అయినా దోషులకు శిక్ష పడటం ఆనందానే ఉంది. నిర్భయ తల్లిదండ్రులకు శాంతి లభించింది’ అంటూ #Justicedelayed హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది ప్రీతీ జింటా. మరో ట్వీట్‌లో.. ‘దోషుల‌ని 2012లోనే ఉరితీసినట్లైతే మహిళలపై క్రైమ్ జరగకుండా ఉండేది. చట్టవిరుద్ధంగా వ్యవహరించేవారిని అదుపులో ఉంచుకోవడం కంటే.. నివారించడ‌మే మార్గం. మహిళలకు న్యాయం చేయడంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి భారత ప్రభుత్వానికి ఇదే మంచి సమయం’ అని ఎంతో ఎమోష‌న‌ల్‌గా ట్వీట్ చేసింది ప్రీతి.  సుస్మితా సేన్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించింది. నిర్భ‌య త‌ల్లి పోరాటానికి న్యాయం జ‌రిగింది.  చివ‌రికి అన్యాయం పోడింద‌ని తెలియ‌జేసింది.


logo