గురువారం 28 మే 2020
Cinema - Apr 30, 2020 , 11:05:54

రిషి క‌పూర్ మృతిపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖులు

రిషి క‌పూర్ మృతిపై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖులు

ఇర్ఫాన్ ఖాన్ మ‌ర‌ణ వార్త నుండి పూర్తిగా కోలుకోక‌ముందే సినిమా రంగానికి మ‌రో షాక్  త‌గిలింది. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు రిషి కపూర్ క్యాన్స‌ర్ కార‌ణంగా ఈ రోజు మృత్యువాత ప‌డ్డారు. ఆయ‌న మృతితో దేశ వ్యాప్తంగా విషాద ఛాయ‌లు నెల‌కొన్నాయి. సినీ, క్రీడా, రాజకీయ రంగానికి చెందిన ప‌ల‌వురు ప్ర‌ముఖులు ఆయ‌న‌తో గ‌డిపిన క్ష‌ణాలు గుర్తు చేసుకుంటూ ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్నారు

రిషి క‌పూర్ మ‌ర‌ణించార‌నే వార్త‌ని నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఇలా జ‌ర‌గ‌కూడ‌దు. గుండె ప‌గిలే విష‌యం ఇది.. రెస్ట్ ఇన్ పీస్ - ఈషా డియోల్ 

ఇది ఖ‌చ్చితంగా గుండెలు ప‌గిలే విష‌యం. సినీ ప‌రిశ్ర‌మ‌కి కోలుకోలేని న‌ష్టం.అత‌నిని ఇష్ట‌ప‌డే వారంద‌రికి ఇది చాలా విచార‌క‌ర‌మైన వార్త‌. ల‌వ్ యూ రిషీ అంకుల్‌.. ఫ‌ర్హాన్ అక్త‌ర్ 

క‌రోనా సంక్షోభంలో రెండు విషాదాలు చోటు చేసుకోవ‌డం బాధ‌గా ఉంది. ఇది నిజంగా జీర్ణించుకోలేనిది. రిషి కపూర్ చాలా అద్భుత‌మైన న‌టుడు. అత‌ను కోలుకున్నాడ‌ని అనుకున్నాము. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కి మా నివాళులు అర్పించ‌లేక‌పోతున్నాం. ఆయ‌న ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని ప్రార్దిస్తున్నాను- హేమ మాలిని 

రిషి కపూర్ మ‌ర‌ణించార‌నే వార్త‌ని న‌మ్మ‌లేక‌పోతున్నాం. నిన్న ఇర్ఫాన్ ఖాన్ ఈ రోజు రిషి క‌పూర్ జీ. దీనిని అంగీక‌రించ‌డం చాలా క‌ష్టంగానే ఉంది. వారి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను- విరాట్ కోహ్లీ

మీ మ‌ర‌ణాన్ని న‌మ్మ‌లేకపోతున్నాను చింటూ జీ... ఎప్పుడు చిరున‌వ్వుతో క‌నిపిస్తారు. ప‌రస్ప‌ర ప్రేమ‌, గౌర‌వం మ‌న‌ద్ద‌రికి ఉన్నాయి. నా స్నేహితుడిని కోల్పోయాను. ఆయ‌న కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను 


logo