ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 06, 2020 , 00:12:02

స్ఫూర్తికాంతుల తారాదీపాలు

స్ఫూర్తికాంతుల తారాదీపాలు

దీపం జ్వలించింది. తిమిరం హరించుకుపోయింది. వెలుగు దివ్వెల్లో అఖిల భారతావని సమైక్యతా కాంతుల్ని వర్షించింది. కరోనాపై సమరంలో అఖండమైన ఐక్యతా ప్రదర్శనకు ప్రతీకగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం దేశవ్యాప్తంగా దీపప్రజ్వలన జయప్రదమైంది. దీపకాంతులతో ఆసేతుహిమాచలం దేదీప్యమానంగా వెలుగులీనింది. 

యావత్‌ సినీలోకం ఈ మహాదీపయజ్ఞంలో పాలుపంచుకుంది. కరోనా భూతాన్ని పారద్రోలే బృహత్‌ సంకల్పంతో తారలందరూ తమ గృహాల్లో దీపాల్ని వెలిగించి సంఘీభావాన్ని చాటారు. ఇందుకు సంబంధించిన చిత్రాల్ని సోషల్‌మీడియాలో పంచుకొని కరోనాపై విజయం సాధించాలనే ధృడసంకల్పాన్ని చాటారు. ఈ దీపజ్యోతి జ్వలనంలో అగ్రహీరోలు చిరంజీవి, రజనీకాంత్‌, వెంకటేష్‌, నాగార్జున, అక్షయ్‌కుమార్‌, రణ్‌వీర్‌సింగ్‌, దీపికాపదుకునే, జాన్వీకపూర్‌ మోహన్‌బాబు, పూజాహెగ్డే, తమన్నా తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.