గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 10:30:54

న‌టి సంజ‌న ఇంట్లో సోదాలు..!

న‌టి సంజ‌న ఇంట్లో సోదాలు..!

శాండ‌ల్‌వుడ్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇటీవ‌ల ప‌ట్టుబ‌డ్డ ఓ డ్ర‌గ్స్ ముఠా నుండి సీసీబీ పోలీసులు కీల‌క స‌మాచారం రాబ‌డుతుండ‌గా, ఇందులో ఎవ‌రెవ‌రు ఉన్నార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే న‌టి రాగిణి ద్వివేదిని పోలీసులు అరెస్ట్ చేయ‌గా,  తాజాగా సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

ఈవెంట్ మేనేజ‌ర్ ప్రీత‌మ్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగ‌ళూరులోని ఇందిరా న‌గ‌ర్‌లో ఉన్న సంజ‌న ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ సోదాల‌లో కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైతే సంజ‌న‌ని అరెస్ట్ చేయ‌డం ఖాయం అని అంటున్నారు. ఇంక ఈమె ద్వారా డ్ర‌గ్స్ ఉచ్చులో ఇంకెంత‌మంది చిక్కుకున్నార‌నే విష‌యాన్ని రాబ‌ట్ట‌నున్నారు. తాజాగా ఈ కేసులో డిజైనర్ నియాజ్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

 


logo