శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Aug 07, 2020 , 09:30:15

ఫెడరలిజానికి వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తు: రియా చ‌క్ర‌వ‌ర్తి

ఫెడరలిజానికి వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తు: రియా చ‌క్ర‌వ‌ర్తి

సుశాంత్ ఖాతాలో కోట్ల రూపాయలు మాయమయ్యానని పాట్నా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా  సీబీఐ ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే సుశాంత్ స్నేహితురాలు రియాకి ఈడీ స‌మ‌న్లు పంప‌గా, 7వ తేదీన విచార‌ణ‌కి హాజ‌రు కావాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన రియా చ‌క్ర‌వ‌ర్తి.. ఫెడరలిజానికి వ్యతిరేకంగా సుశాంత్ రాజ్‌పుత్ కేసు విష‌యంలో సిబిఐ చ‌ట్ట విరుద్ధంగా దర్యాప్తు చేస్తుంద‌ని పేర్కొంది.

పాట్నాలో తనపై నమోదైన కేసును ముంబైకి బదిలీ చేయాలని రియా చ‌క్ర‌వ‌ర్తి కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాస్త ఓపిక‌తో ఉండాలని ఆమె అన్నారు. ఈ సమయంలో సిబిఐ జరిపిన దర్యాప్తు  పూర్తిగా చట్టవిరుద్ధం. ఫెడ‌రిలిజానికి వ్య‌తిరేఖం అని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలో మరణించినందున, ఈ కేసుపై అధికార పరిధి మ‌హారాష్ట్ర పోలీసులు కలిగి ఉండాలని బీహార్ పోలీసుల‌కి కాద‌ని రియా  వాదించారు. బీహార్ ప్రభుత్వం దర్యాప్తు చేసే అధికారం లేని ప‌క్షంలో ఈ కేసుని ముంబై పోలీసులకు బదులుగా సిబిఐకి బదిలీ చేసింది అని ఆమె ప్రకటనలో పేర్కొంది. కాగా, బీహార్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు రియాతో పాటు మరియు మరో ఐదుగురిపై  గురువారం సీబీఐ కేసు నమోదు చేసిన విష‌యం విదిత‌మే.


logo