మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 13, 2020 , 16:41:16

రియాకు ఊర‌ట‌..ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ కాలేద‌ట‌..!

రియాకు ఊర‌ట‌..ఖాతాకు న‌గ‌దు బ‌దిలీ కాలేద‌ట‌..!

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ ఆక‌స్మిక మృతి కేసులో సీబీఐ ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి రియా పెద్ద మొత్తంలో న‌గ‌దు త‌న ఖాతాలోకి మ‌ళ్లించుకుంద‌ని ఆరోప‌ణ‌లు, వార్త‌లు వ‌చ్చాయి. రెండు రోజుల్లో 18 గంట‌ల‌కుపైగా ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తిని విచారించారు. ద‌ర్యాప్తులో రియా  ఆస్తుల‌కు సంబంధించిన అధికారులు అడిగిన అన్ని డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించిద‌ట‌. అంతేకాదు త‌న లైఫ్ స్టైల్ గురించి కొన్ని విష‌యాలు చెప్పింద‌ట‌. సుశాంత్ కు సంబంధించిన బ్యాంకు ఖాతాల‌కు రియా చ‌క్ర‌వ‌ర్తి జాయింట్ అకౌంట్ హోల్డ‌ర్ గా లేద‌ని ఈడీ అధికారులు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది.

అంతేకాదు సుశాంత్ ఖాతా నుంచి రియా అకౌంట్‌కు కానీ, ఆమె కుటుంబ‌స‌భ్యుల ఖాతాకు కానీ ట్రాన్స్ ఫ‌ర్ కాలేద‌ని ఈడీ నిర్దారించిన‌ట్టు టాక్‌. ఈడీ అధికారులు నిర్దార‌ణ‌తో రియా చ‌క్ర‌వ‌ర్తికి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్టేనంటున్నారు నెటిజ‌న్లు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo