ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Sep 04, 2020 , 09:18:22

సుశాంత్ కేసులో మీడియా క‌థ‌నాలు అవాస్త‌వం: సీబీఐ

సుశాంత్ కేసులో మీడియా క‌థ‌నాలు అవాస్త‌వం: సీబీఐ

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐ ద‌ర్యాప్తు చేస్తున్న విష‌యం తెలిసిందే. జూన్ 14వ తేదీన ముంబైలో సుశాంత్ అనుమానాస్ప‌ద రీతిలో మృతిచెందాడు. అయితే ఆ కేసులో ప్ర‌స్తుతం సీబీఐ ముంబైలోనే విచార‌ణ చేప‌డుతున్న‌ది. సుశాంత్‌ది మ‌ర్డ‌ర్ కాదు అన్న‌ట్లుగా గురువారం కొన్ని మీడియా సంస్థ‌లు వార్త‌లు ప్ర‌సారం చేశాయి.  ఆ విష‌యాన్ని సీబీఐ వ‌ర్గాలు వెల్ల‌డించిన‌ట్లుగా చెప్పుకొచ్చాయి. అయితే ఆ వార్త‌ల‌ను సీబీఐ ఖండించింది. సుశాంత్ మృతి కేసు విచార‌ణ వివ‌రాల‌ను ఏ మీడియా సంస్థ‌తోనూ చ‌ర్చించ‌లేద‌ని సీబీఐ స్ప‌ష్టం చేసింది.  సుశాంత్ కేసులో ఓ ప‌ద్ధ‌తి ప్ర‌క‌రాం, చాలా ప్రొఫ‌ష‌న‌ల్‌గా ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు సీబీఐ వెల్ల‌డించింది. మీడియాలో వ‌స్తున్న వార్త‌లు ఊహాజ‌నిత‌మ‌ని, వాటిల్లో వాస్త‌వం లేద‌న్నారు. త‌మ పాల‌సీ ప్ర‌కారం ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న వేళ‌.. ఎటువంటి స‌మాచారాన్ని తాము షేర్ చేసుకోమ‌ని సీబీఐ చెప్పింది. సీబీఐ ప్ర‌తినిధి కానీ ఇత‌ర సంబంధిత వ్య‌క్తులు కానీ సుశాంత్ కేసు స‌మాచారాన్ని మీడియాకు చేర‌వేయ‌లేద‌న్నారు.
logo