ఆదివారం 17 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 12:52:23

టీవీ ఆర్టిస్ట్‌పై రేప్.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీవీ ఆర్టిస్ట్‌పై రేప్.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పెళ్లి చేసుకుంటాన‌ని మాయ‌మాట‌లు చెప్పి కాస్టింగ్ డైరెక్ట‌ర్  నన్ను అత్యాచారం చేశాడంటూ 26 ఏళ్ళ టీవీ న‌టి ముంబై పోలీసు స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసింది. రెండేళ్లుగా వీరిద్ద‌రు రిలేష‌న్‌లో ఉండ‌గా, ప‌లు ప్ర‌దేశాల‌లో ఆమెపై అత్యాచారం చేశాడ‌ట‌. ఇప్పుడు మోహం చాటేయ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో సిటీలోని వ‌ర్సోవా పోలీసుల‌ని సంప్ర‌దించింది న‌టి. అయితే ఆమె నుండి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన‌ పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ న‌మోదు  చేశారు.  

భారత శిక్షాస్మృతి సెక్షన్ 376 (అత్యాచారం) కింద నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసాము. ఇంకా అరెస్ట్‌ చేయలేదు. ఈ కేసుపై మేము దర్యాప్తు చేస్తున్నాము" అని వెర్సోవా సీనియర్ పోలీసు అధికారి రాఘ్వేంద్ర ఠాకూర్ తెలిపారు. నిందితుడువివాహం చేసుకుంటానని నటికి హామీ ఇచ్చాడని, కాని తరువాత అతను  నిరాకరించడంతో కేసు పెట్టింద‌ని చెప్పుకొచ్చారు